
ఫొటో చూసి నిర్ఘాంతపోయారా? అంతా ఇలాగే షాకవుతున్నారు. దీపిక పదుకోన్ అతి సాధారణ అవతారం చూసి జనాలంతా కన్ఫ్యూజ్ అవుతున్నారు. 'బాజీరావ్ మస్తానీ'లో రాజసం ఒలకబోసిన ధీర వనితను ఈ గెటప్ లో ఊహించి ఉండరు చాలామంది. కానీ సినిమా అంటేనే అంత. ఎంతటి హాట్ హీరోయిన్ ను అయినా సాధారణ వ్యక్తిగా మార్చేస్తుంది. వివరాల్లోకి వచ్చేస్తే.. మన మస్తానీ లీడ్ రోల్ లో ఇరాన్ కు చెందిన ప్రముఖ్ దర్శకుడు మాజిద్ మాజిది ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముంబైలోని ప్రముఖ ధోబీ ఘాట్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో దీపిక రోల్ పై స్పష్టత లేకపోయినా, ఆహార్యాన్ని బట్టి ఆమె ధోబీగా నటిస్తుందనే విషయం అర్ధమైపోతోంది.
మాజిది సినిమాలు బంధాలు, భావోద్వేగాల సమాహారంగా సాగుతాయి. ఆ స్టైల్లోనే ఈ చిత్రం కూడా ఉంటుందట. ముంబైతో పాటూ ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, కాశ్మీర్ ల్లోనూ ఈ చిత్రం షూటింగ్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే, ధోబీ ఘాట్ ల్లో జరుగుతున్న షూటింగ్ కు దీపిక ఉత్సాహంగా పాల్గొంటోంది. మాజిది సూచనలు తీసుకుంటూ షూటింగ్ స్పాట్ లో సందడి చేస్తోంది. సాధారణ చూడీదార్, చెదరిన జుట్టుతో ఉన్న దీపికను చూస్తే ఈ పాత్రలో జీవించేందుకు ఆమె ట్రై చేస్తున్నట్లే ఉంది. మాజిది పిక్చర్ తో దీపిక అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యే అవకాశం ఉంది. ఆమె ఇప్పటికే 'ట్రిపుల్ ఎక్స్..' హాలీవుడ్ మూవీలో నటించింది. ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. హాలీవుడ్ లో సత్తా చాటేందుకు యత్నిస్తున్న దీపిక దేశీయంగానూ ప్రతిష్టాత్మక చిత్రాల్లో ప్రధాన పాత్రలు కైవసం చేసుకుంటోంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక కథాంశం 'పద్మావతి'లో ఆమెదే టైటిల్ రోల్.
No comments:
Post a Comment