Nestham Movie Creations

Friday, 11 November 2016

కూతురి ఎఫైర్‌తో శ్రీదేవి అప్ సెట్


టీ నేజ్ అంటేనే రకరకాల ఊహలు రకరకాల ఆలోచనలు ఉంటాయి. అలాంటిది రంగురంగుల సినిమా ప్రపంచంలో పుట్టిపెరిగిన సెలబ్రిటీ పిల్లలు యుక్తవయస్సుకి వచ్చే సరికి ప్రేమ, బాయ్ ఫ్రెండ్స్‌ని మెయింటెన్ చేస్తూ మేం వయసుకు వచ్చాం అని చెప్పకనే చెప్పుతున్నారు. తెలిసీ తెలియని వయసులో చేస్తున్న ఈ కొంటెపనులతో తల్లిదండ్రులకు తన నొప్పులు తెస్తున్నారు. తాజాగా శ్రీదేవి పెద్దకూతురు ‘జాహ్నవి’ తన బాయ్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో ఈ డేటింగ్ వ్యవహారంపై మండిపడుతుంది నటి శ్రీదేవి. రీ సెంట్‌గా శ్రీదేవి గారాలపట్టి ‘జాహ్నవి’ తన బాయ్‌ఫ్రెండ్ శిఖర్‌తో లిప్‌లాక్ చేస్తూ ఫొటోలకు ఫోజులను ఓ రేంజ్‌లో ఇచ్చింది. ఇంతకీ లిప్‌లాక్‌లో ‘జాహ్నవి’తో పాటు ఉన్నది ప్రముఖ రాజకీయ నాయకుడు మనుమడు. టీనేజ్‌లో ఉన్న వీరిద్దరి రిలేషన్‌పై నటి శ్రీదేవి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యిందట. ‘జాహ్నవి’ హాట్ హాట్ ముద్దుల ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీటికి ఇక్కడే ఫుల్‌స్టాప్ పెట్టాలని కూతుర్ని మందలించిందట. అం తేకాదు కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్న కూతురికి గట్టిగానే కండిషన్స్ పెట్టిందట. ఈ వయసులోనే ‘జాహ్నవి కపూర్’ బాయ్ ఫ్రెండును మెయింటేన్ చేయడం, అతనితో దిగిన ఫోటోలు పోస్టు చేయడం బట్టి చూస్తే వ్యవహారం ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చని, ‘జాహ్నవి’కి స్వేచ్ఛ కాస్త ఎక్కువే లభించినట్లు ఆమె యాటిట్యూడ్ బట్టి అర్థమవుతోందని మీడియాలో కథనాలు రావడంతో శ్రీదేవి కూతురికి వార్నింగ్ ఇచ్చిందట. బా లీవుడ్‌లో ఎఫైర్స్ అన్నవి చాలాకామన్ . కాని బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకుండానే ‘జాహ్నవి’ఇలా రెచ్చిపోయి రచ్చ చేస్తుంటే ఎంటర్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తుందా అని బాలీవుడ్ జనాలకు డౌట్ రేజ్ అయ్యింది. అయితే వీటన్నింటినీ శ్రీదేవి కొట్టిపారేస్తూ ‘జాహ్నవి’ప్రస్తుతం చదువుకుంటుంది. అది అయ్యాక తన నిర్ణయాన్ని బట్టి సినిమాల గురించి ఆలోచిస్తామన్నారు.

No comments:

Post a Comment

About

Flickr