
యాంకర్ ఓంకార్‌కు ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో.. యాంటి ఫ్యాన్స్ అంత కంటే ఎక్కువే ఉంటారు. బుల్లితెరపై అతను ఎంచుకున్న కార్యక్రమాలు.. వాటిని నడిపించిన తీరు ఎలా ఉన్నా అతనైతే సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత మెగా ఫోన్ పట్టి తొలి ప్రయత్నంలో దెబ్బ తిన్నా.. ‘రాజు గారి గది’తో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు దర్శకుడిగా మరింత భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నాడు.
పీవీపీ లాంటి పెద్ద సంస్థ ఓంకార్‌తో సినిమాకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఓంకార్ ఈసారి తీయబోయేుది ‘రాజు గారి గది’కి సీక్వెల్ కావడం విశేషం. ఈ చిత్రానికి ముందు విక్టరీ వెంకటేష్ హీరో అని ప్రచారం జరిగింది. వెంకీ కూడా ఓంకార్‌తో చర్చలు జరిగినట్లు చెప్పాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. వెంకీ ప్లేస్‌లోకి నాగార్జున వచ్చాడంటున్నారు. కొన్ని కారణాల వల్ల వెంకీ ఈ సినిమా చేయనని చెప్పేయడంతో నాగార్జునను సంప్రదించాడట ఓంకార్.
ఆల్రెడీ పీవీపీ బేనర్లో ‘ఊపిరి’ లాంటి సినిమా చేసిన నాగ్.. ఓంకార్ స్క్రిప్టు మీద ఆసక్తిగానే ఉన్నాడట. ఐతే ఇంకొంచెం వర్క్ చేయమని చెప్పాడట. త్వరలోనే ఓంకార్-నాగ్ కాంబినేషన్లో సినిమా మొదలు కావచ్చని సమాచారం. ‘రాజు గారి గది’కి సీక్వెల్ అన్నప్పటికీ కథ పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఓంకార్ లాంటి దర్శకుడు నాగార్జునను డైరెక్ట్ చేయడమంటే మామూలు విషయం కాదు. అందులోనూ పీవీపీ బేనర్ ఈ చిత్రాన్ని నిర్మించడం మరింత పెద్ద విశేషమే - please share link and comment my post
No comments:
Post a Comment