Nestham Movie Creations

Friday, 11 November 2016

ఐశ్వర్య ఓకే అన్నా.. సెన్సార్ కత్తిరించేసింది

ఐశ్వర్య ఓకే అన్నా.. సెన్సార్ కత్తిరించేసింది
'ఏ దిల్ హై ముష్కిల్' బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యారాయ్, రణ్‌బీర్ కపూర్ లకు కీలక సినిమా. సెకండ్‌ ఇన్నింగ్స్‌ కు ఊపునిస్తుందని ఐష్, కెరీర్‌ ను గాడిలో పెడుతుందని రణ్‌బీర్ భారీ ఆశలే పెట్టుకున్నారు ఈ చిత్రంపై. అందరి చూపూ తనవైపు తిప్పుకోవాలన్న లక్ష్యంతో ఐష్ ఈ సినిమాలో రణ్‌బీ‌ర్‌తో ఉండే ఇంటిమేట్ సన్నివేశాల తీవ్రతను పెంచాలంటూ స్వయంగా దర్శకుడు కరణ్‌ జోహార్‌ కు సూచించింది. ఆవిడే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంచి మసాలా కూడా దట్టించి ఇద్దరి మధ్యా హాట్ రొమాంటిక్ సీన్స్ షూట్ చేశాడు కరణ్. ఈ సంగతి ట్రైలర్లలోనే తెలిసిపోయింది. ఐష్, రణ్‌బీర్ ల కెమిస్ట్రీని చూడాలనుకుంటున్న జనాల ఆసక్తిని మరింతగా పెంచేసిందా ట్రైలర్. అయితే ఇలా వారిద్దరినీ చూడాలనుకుంటున్న జనాల ఆశ నెరవేరే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ సీన్స్‌ సెన్సార్ కత్తెరకు బలైపోయాయి. ఇటీవలే సెన్సార్ లాంఛనానికి వెళ్లింది 'ఏ దిల్ హై ముష్కిల్'. ఈ కార్యక్రమానికి దర్శకుడు కరణ్ కూడా హాజరయ్యాడు. సినిమాను ఆసాంతం పరిశీలించిన అధికారులు ఐశ్వర్య రాయ్, రణ్‌బీర్‌ లపై హద్దుమీరి చిత్రీకరించిన మూడు సన్నివేశాలను కత్తిరించేశారు. ఈ కత్తిరింపులపై కరణ్ బాగానే వాదించాడు. ఆ మూడు సీన్సే తన చిత్రానికి కీలకమని, అలాంటి వాటిని తీసేస్తే సినిమాకి అర్ధమే ఉండదని వివరించాడు. అయినప్పటికీ ఆ ఇంటిమేట్ సన్నివేశాలు చిన్నపిల్లలు చూడదగ్గవి కావంటూ సెన్సార్ బోర్డు తమ పంతమే నెగ్గించుకుని యూఏ సర్టిఫికెట్ కట్టబెట్టింది. పరిణితితో తీసిన సినిమా కంటెంట్, ఉద్దేశం బాగానే ఉన్నా ప్రధాన పాత్రల మధ్య చిత్రీకరించిన హాట్ సీన్స్‌పై సెన్సార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. సెన్సార్ కత్తెర తన టాలెంట్ నిరూపించుకోవాలనుకున్న ఐశ్వర్య రాయ్‌ కు శరాఘాతమే. మొత్తానికి హాట్‌ గా కనిపించేందుకు ఐశ్వర్య ఒప్పుకున్నా సెన్సార్ బోర్డు మాత్రం అంగీకరించలేదు. - please share link and comment my post

No comments:

Post a Comment

About

Flickr