Nestham Movie Creations

Friday, 11 November 2016

బి-గ్రేడ్ సినిమాలు చేసే ఈ స్థాయికి వచ్చా

బి-గ్రేడ్ సినిమాలు చేసే ఈ స్థాయికి వచ్చా
బాలీవుడ్ సెన్సేషనల్ ఫిగర్ కంగనా రనౌత్ బోల్డ్ స్టేట్‌ మెంట్స్‌ తో ఈ మధ్య వార్తల్లో బాగా నానుతోంది. హృతిక్‌ రోషన్‌ తో వివాదాన్ని ఇన్‌డైరక్ట్‌గా తరచూ కదుపుతూ ఎంటర్టైన్‌మెంట్ మీడియాకు కావాల్సినంత సమాచారాన్ని ఇస్తున్న ఈ భామ తాజాగా మరో షాకింగ్ ప్రకటన చేసింది. 'బి-గ్రేడ్' సినిమాలు చేసి టాప్ స్టార్‌గా ఎదిగిన నటిని బహుశా తానే కావచ్చని వ్యాఖ్యానించింది. కంగనా ఈ తరహాలో స్పందించడంతో బాలీవుడ్‌ జనాలు కాస్త నిర్ఘాంతపోయారు. ఎంతైనా 'క్వీన్' స్థాయిలోనే అమ్మడు రెస్పాండ్ అయిందంటూ మరికొందరు అభినందిస్తున్నారు. కంగన తాజా ఇంటర్వ్యూలో తన గురించి అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. విజయాలు, పరాజయాలు తనపై ఎలాంటి ఒత్తిడి చూపవని పేర్కొంది. ఓ సినిమాను ఎంపిక చేసుకునే ముందు, సదరు చిత్రం ద్వారా పరిశ్రమలో తన స్థానం మరింత మెరుగవుతుందా? అని ఆలోచించదట. పాత్ర నచ్చితే ఒప్పేసుకుంటుందట. "పని పట్ల నేను ఎలాంటి ప్రమాణాలు నిర్దేశించుకోలేదు. అలాగే ఎలాంటి ఒత్తిడీ పెట్టుకోలేదు. ఈ మార్గంలో (సినిమాల్లో) కొనసాగాలనే నాకు నేను చెప్పుకుంటుంటాను. ఓ ప్రాజెక్ట్ నా స్థాయిని పెంచుతుందని ఏనాడూ అనుకోలేదు. బి-గ్రేడ్ సినిమాలు చేసిన టాప్ నటిని బహుశా నేనే కావచ్చు. ఫ్లాప్‌లు వచ్చినా విలువైన కళాకారిణిగానూ ఉండొచ్చనే సంగతి నా విషయంలో రుజువైంది" అని కంగన తన గురించి బాగానే చెప్పుకుంది. తన టాలెంట్‌ను ప్రశంసించుకోవడం సంగతి పక్కనపెడితే ఓ స్టార్ యాక్ట్రస్‌ అయి ఉండి, గతంలో తాను నటించిన శృంగార చిత్రాలకు తన సక్సెస్‌లో భాగం కట్టబెట్టడం కంగనకే చెల్లింది. - please share link and comment my post

No comments:

Post a Comment

About

Flickr