
శ్వేతా బసు ప్రసాద్.. బాలనటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న అమ్మాయి. తెలుగులోనూ ‘కొత్త బంగారు లోకం’ లాంటి మంచి సినిమాతో కథానాయికగా పరిచయమైంది. కానీ ఆమె పేరు ఎత్తితే ఇవేవీ గుర్తుకు రావు. ప్రాస్టిట్యూషన్ కేసులో ఆమెను అరెస్టు చేయడం.. ఆ విషయంలో జరిగిన గొడవ మాత్రమే గుర్తుకొస్తాయి. వాటి గురించే జనాలు చర్చించుకుంటారు. నిజానికి ఆ రోజు అసలేం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. ఈ కేసు నుంచి బయటపడ్డాక కూడా శ్వేత క్లియర్ గా అసలు ఆ రోజేమైందో చెప్పలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె నోరు విప్పింది. ఆ రోజు ఏం జరిగిందనే విషయంలో శ్వేత వెర్షన్ ఏంటంటే..
‘సంతోషం’ సినీవార పత్రిక అవార్డుల వేడుకలో పాల్గొనడానికి శ్వేత బసు హైదరాబాద్ వచ్చిందంట. ఇక్కడి స్టార్ హోటల్లో ఆమె బస చేసిందట. అవార్డు ప్రదానోత్సవం పూర్తి కాగానే ముంబయి వెళ్లిపోవాలనుకుందట. కానీ ఆమె ఫ్లైట్ మిస్ అయ్యిందట. దీంతో హోటల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందట. ఆ సమయంలో హోటల్‌పై పోలీసులు దాడి చేయడం.. అరెస్టు చేయడం జరిగాయట. ఇంకుమించి తనకే పాపం తెలియదు అంటోంది శ్వేత బసు. మరి సినీ రంగానికి సంబంధించి ఏ ప్రాస్టిట్యూషన్ కేసు బయటపడ్డా తన పేరును ముడిపెట్టి చర్చలు జరపడం గురించి స్పందిస్తూ.. ‘‘నాకు సంబంధం లేని విషయాల్లో కూడా నా పేరుని లాగుతున్నారంటే నేను పాపులర్ అని అర్థం. నా పేరు స్పెల్లింగ్ బాగుందని.. నా ఫొటోలు బాగున్నాయనీ అర్థం. ఐతే మీడియా నాకు ఎప్పడూ సపోర్ట్‌గనే ఉంది. నా మంచి కోరుకునే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. నాకు వాళ్లు చాలు. ఎవరేం మాట్లాడుకున్నా పట్టించుకోను. అయినా మాట్లాడేవాళ్ల నోళ్లు మూయించలేం’’ అని చెప్పింది శ్వేత - please share link and comment my post
No comments:
Post a Comment