Nestham Movie Creations

Friday, 11 November 2016

కమల్ - గౌతమి బ్రేకప్... మధ్యలో రమ్యకృష్ణ..?


gautami-kamal-ramyaతను కమల్ హాసన్ నుంచి విడిపోవడం చాలా బాధాకరంగా ఉందంటూ ఆయనతో సహజవనం చేస్తూ వచ్చిన నటి గౌతమి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె కమల్ హాసన్ నుంచి ఎందుకు విడిపోతున్నది వివరంగా చెప్పలేదు. ఈ నేపధ్యంలో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. తొలుత వీరి బ్రేకప్‌కు నటి శ్రుతి హాసన్ అని చెప్పుకున్నారంతా. gautami-kamal-ramya కాస్ట్యూమ్స్ విషయంలో శ్రుతి హాసన్-గౌతమిల మధ్య మాటలు వచ్చాయనీ, ఆ విషయంలో కమల్ శ్రుతికి మద్దతు పలికారన్నది తెలిసిందే. తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. అదేమిటంటే... నటి రమ్యకృష్ణ శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హీరో. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా గౌతమి వ్యవహరించారు. ఐతే ఈమధ్య కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమి-రమ్యకృష్ణకు గొడవ జరిగిందట. ఈ గొడవలో కూడా కమల్ తలదూర్చడమే కాకుండా రమ్యకృష్ణకు సపోర్ట్ చేశారట. గతంలో శ్రుతి హాసన్‌కు ఇలాగే సపోర్ట్ చేయడమూ, తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అనుమానంతో గౌతమి బ్రేకప్ చెప్పిందని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

No comments:

Post a Comment

About

Flickr