

కాస్త పేరున్న హీరోయిన్ ఎవరితో ఐటెమ్ సాంగ్ చేయించుకున్నా కోటి రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోంది. మామూలుగా సినిమాకి తీసుకునే పారితోషికం కంటే ఐటెమ్ సాంగ్‌కే ఎక్కువ ఇవ్వాలని హీరోయిన్లు డిమాండ్ చేస్తున్నారు. పాటల్లో కనిపించడం వల్ల తమ ఇమేజ్ కాస్త తగ్గుతుంది కనుక ఆ త్యాగానికి తగ్గట్టు పేమెంట్ వుండాలనేది వారి వాదన. ఈ లెక్కన చూసుకుంటే సన్నీ లియోన్ ఐటెమ్ సాంగ్‌లకి చాలా తక్కువే ఛార్జ్ చేస్తోంది.
ఆమెకి మామూలుగా ఒక సినిమాకి రెండు కోట్ల రూపాయలిస్తారనే టాక్ వుంది. కానీ ఐటెమ్ సాంగ్‌కి వచ్చేసరికి చాలా రీజనబుల్‌గా అడుగుతోంది. 'డోంగ్రీ కా రాజా' అనే చిత్రంలో పాట చేయడానికి సన్నీలియోన్ నలభై లక్షలే ఛార్జ్ చేసిందట. ఐటెమ్ సాంగ్స్ పట్ల సన్నీ ఇంత రీజనబుల్‌గా వుండడం వల్లే ఆమెకి ఏకంగా ఆరు సినిమాల్లో ఇలాంటి పాటలు చేసే అవకాశం వచ్చింది. చివరకు స్టార్ హీరోల చిత్రాల్లోను సన్నీలియోన్‌నే తీసుకుంటున్నారు.
అచ్చంగా ఐటెమ్ సాంగ్స్ మాత్రమే చేసే మలైకా అరోరా లాంటి వాళ్లకి ఇప్పుడు పని లేకుండా పోయింది. యూత్‌లో క్రేజ్ ఉన్న సన్నీ ఇంత తక్కువ ధరకే వస్తున్నప్పుడు వేరే ఆప్షన్స్ ఎందుకని నిర్మాతలు భావిస్తున్నారు. తక్కువ పారితోషికం అడగడంలోని లాభాలేంటో సన్నీకి తెలిసే ఇలా చేసిందా లేక అలా కలిసొచ్చేసిందా అనేది తెలీదు కానీ పాటల రూపంలోనే నాలుగు రోజులకి నలభై లక్షలు వెనకేసేసుకుంటూ ఖజానా నింపేసుకుంటోందీ సుందరి.
No comments:
Post a Comment