
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో స్వీటీ అనుష్క కూడా ఉంది. అందుకే వీరి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు 30 దాటేసిన 'అరుంధతి' స్టార్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రస్తతం అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ లు పెళ్లికి రెడీ అయిపోతున్నారు. దీంతో తరచూ మార్యేజ్ న్యూస్ తో హల్ చల్ చేసే అనుష్కపైకి కూడా మరోసారి దృష్టి మళ్లింది. పెళ్లెప్పుడు అని చాలామంది అడుగుతుండడంతో ఆ విషయమై మొత్తానికి నోరు విప్పింది ఈ బ్యూటీ. గత ఆరేళ్లుగా తన వివాహం గూర్చిన వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చిన ఈ 'బాహుబలి' సొగసరి పెద్దలు కుదిర్చిన పెళ్లికే మొగ్గుచూపుతున్నట్లు పేర్కొంది.
"పెళ్లి అనేది వ్యక్తిగత తంతుగా పేర్కొని తప్పించుకునే ఉద్దేశం నాకు లేదు. రహస్యంగా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకు ఏమాత్రం లేదు. పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటా. ఆ శుభగడియను అందరితో పంచుకుంటా" అని వివరించింది అనుష్క. పెద్దలు కుదిర్చిన వివాహం పట్ల ఆసక్తి వ్యక్తంచేసిన స్వీటీ తనది ప్రేమ వివాహమైనా కావచ్చు అంటూ ఓ ట్విస్ట్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీ ముదురు హీరోయిన్లుగా నయనతార, త్రిష, అనుష్కలపై ముద్ర పడిపోయింది. నయన్ ప్రేమ వ్యవహారాలు పెళ్లి దాకా వెళ్లి బ్రేకప్ బాటపట్టాయి. త్రిష సంగతీ అంతే. అనుష్కపై కూడా గతంలో అనేక వార్తలొచ్చాయి. కొన్ని రోజుల క్రితం వరకూ ఆమె ఓ బడా నిర్మాతను పెళ్లి చేసుకోనుందని చెప్పుకున్నారు. పప్పన్నం ఎప్పుడు పెడుతుందో చెప్పేస్తే..ఇలాంటి రూమర్స్ కు దేవసేన కళ్లెం వేసేయొచ్చు
No comments:
Post a Comment