Nestham Movie Creations

Saturday, 12 November 2016

డేటింగ్ చేస్తున్నట్లు చెప్పేసిన ‘బెంగాలీ రసగుల్లా’


డేటింగ్ చేస్తున్నట్లు చెప్పేసిన ‘బెంగాలీ రసగుల్లా’తన మాటలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకున్న బెంగాలీ బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్. తన తొలి చిత్రంతోనే తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తర్వాతి కాలంలో ఆ ఇమేజ్ ను కాపాడుకోలేకపోయింది. కొత్త బంగారు లోకంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగాలీ రసగుల్లా.. తర్వాత మాత్రం తన హవా పెద్దగా చాటలేకపోయింది. ఆమె జీవితంలో పలు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవటంతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. కేసులు.. వివాదాల అనంతరం ముంబయి వెళ్లిపోయిన ఆమె గురించి తదనంతరం వార్తలేమీ రాలేదు. ఇదిలా ఉండగా ఈ బ్యూటీ లవ్ లో పడిందని.. ప్రస్తుతం డేటింగ్ జోరుగా సాగుతుందన్న వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. తనపై వస్తున్న వార్తలపై శ్వేతాబసు రియాక్ట్ అయ్యారు. ముసుగులో గుద్దులాట ఎందుకనుకున్నారో.. ఏమో కానీ ఓపెన్ అయిపోయారు. తన మీద వస్తున్న వార్తలకు తగ్గట్లే తాను రిలేషన్ షిప్ లోఉన్నానని చెప్పేశారు. రోహిత్ మిట్టల్ అనే అప్ కమింగ్ ఫిల్మ్ మేకర్ తో జరిగిన పరిచయం.. ప్రణయంగా మారి ప్రస్తుతం డేటింగ్ స్థాయికి చేరుకున్నట్లు చెప్పేసింది. రెండేళ్ల నుంచి రిలేషన్ షిప్ లోఉన్నామని.. ‘‘వియ్ ఆర్ హ్యాపీ’’ అని చెప్పింది. వివాదం అనంతరం ఆ మధ్యన ముంబయికి వెళ్లిన ఆమెకు ప్రముఖ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ సంస్థలో కొలువు దక్కింది. ప్రస్తుతం ఒక సినిమా.. ఒక సీరియల్ లో నటిస్తున్న శ్వేతాకు బాలీవుడ్ లో పెద్ద అండే దొరికిందని చెబుతున్నారు. ప్రేమ గురించి ఓపెన్ అయ్యాక రెగ్యులర్ గా వచ్చే పెళ్లి ముచ్చటనే శ్వేతాబసు ముందు పెడితే.. ఆ ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండానే సమాధానం చెప్పేసింది. పెళ్లి గురించి తాము ఆలోచించలేదని.. అయితే పెళ్లి స్మూత్ గా జరుగుతుందన్న నమ్మకం తనకున్నట్లు చెప్పింది. రెండేళ్ల రిలేషన్ షిప్ నడుస్తున్నా పెళ్లి గురించి ఆలోచించకపోవటం ఏమిటో? ఆ ముచ్చట ఎలా ఉన్నా.. ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి అయితే స్మూత్ గా జరుగుతుందన్న నమ్మకం గ్రేటే. శ్వేతాబసు అనుకున్నట్లే జరగాలనుకుందాం.

No comments:

Post a Comment

About

Flickr