క్యాన్సిల్ అనుకున్న కాంబినేషన్ వర్కవుట్ అయిపోయింది. అల్లు అర్జున్-లింగుస్వామి కాంబినేషన్లో ద్విభాషా చిత్రం గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ముందు హరీష్ శంకర్ సినిమాను మొదలుపెట్టి.. సగం పూర్తి చేశాక లింగుస్వామి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నాడు బన్నీ. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా మొదలవుతుంది. సూర్య కజిన్ జ్నానవేల్ రాజా ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషలు రెండింట్లోనూ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పటిదాకా బన్నీ, లింగుస్వామి, జ్నానవేల్ రాజా మినహాయిస్తే ఈ ప్రాజెక్టు విషయంలో ఇంకే పేర్లూ కన్ఫమ్ కాలేదు. మిగతా వాళ్ల మాటెలా ఉన్నా ఈ చిత్రంలో బన్నీ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న దాని మీదే అందరి ఆసక్తి నిలిచి ఉంది. ఈ మధ్య తెలుగు హీరోలందరికీ హీరోయిన్ల సమస్య ఎదురవుతోంది. ఆ అమ్మాయి.. ఈ అమ్మాయి అంటూ చాలామందిని ట్రై చేసి.. చివరికి ఎవరో ఒకరికి ఫిక్సవుతున్నారు. బన్నీ-హరీష్ సినిమాకు కూడా రకరకాల పేర్లు పరిశీలించి చివరికి పూజా హెగ్డేను ఫిక్స్ చేశారు. ఇక బన్నీ కొత్త సినిమా విషయంలో ముందుగా కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. ‘నేను శైలజ’తో మంచి విజయాన్నందుకున్న కీర్తి.. ఆ తర్వాత నాని పక్కన ‘పక్కా లోకల్’ చేస్తోంది. వేరే స్టార్ హీరోల పక్కన ఆమెకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. ఐతే బన్నీ పక్కన ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేస్తే అటు తమిళ వెర్షన్‌కు కూడా బాగా కలిసొస్తుంది. డేట్లు అవీ చూసుకుని దాదాపుగా ఆమెనే ఫైనలైజ్ చేసే అవకాశాలున్నాయి.

No comments:
Post a Comment