Nestham Movie Creations

Friday, 11 November 2016

ఇంజెక్షన్ తో కండోమ్స్ కు చెక్


ఇంజెక్షన్ తో కండోమ్స్ కు చెక్అవాంఛిత గర్భం నిరోధించేందుకు ఇక కండోమ్స్‌ వాడనవసరం లేదు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగించే గర్భనిరోధక మాత్రలను వేసుకోవాల్సిన పని అసలే ఉండదు. మగవారు ఎనిమిది వారాలకోసారి.. రెండు హార్మోన్‌ ఇంజక్షన్లు వేయించుకుంటే చాలు.. గర్భం వస్తుందన్న భయం లేకుండా.. శృంగారంలో మునిగితేలవచ్చు. హార్మోన్‌ ఇంజక్షన్లతో మగవారిలో స్పెర్మ్‌ కౌంట్‌(శుక్రకణాల సంఖ్య)ను తగ్గిపోయేలా చేయవచ్చని ఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ శాస్త్రవేత్త మన్మోహన్‌ మిస్రోతో కూడిన అంతర్జాతీయ బృందం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మారియో ఫిలిప్‌ అనే శాస్త్రవేత్తతో కలిసి మిస్రో చేసిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైంది. ఈ ఇంజక్షన్లు తీసుకున్నవారిలో నలుగురి భార్యలకు మాత్రమే గర్భం వచ్చిందని, సుమారుగా 96 శాతం సమర్థంగా పనిచేశాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, వీటివల్ల కూడా కండరాల నొప్పి, మొటిమలు వంటి పలు దుష్ప్రభావాలు రావడంతో వాటిని నివారించేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. కాగా ఇప్పటికే కండోమ్స్ కారణంగా విశృంఖల శృంగారం పెరిగిపోతోందని సంప్రదాయవాదులు ఆరోపిస్తున్న తరుణంలో.. ఈ ఇంజెక్షన్లు అందుబాటులోకి వస్తే.. స్వేచ్ఛా శృంగారం మరింత విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

About

Flickr