Nestham Movie Creations

Thursday, 10 November 2016

కూతురికి శ్రీదేవి వార్నింగ్‌?


అతిలోక సుందరి శ్రీదేవి తన పెద్ద కూతురు జాన్వికిఇటీవల ఇలా వార్నింగ్‌ ఇచ్చిందట! దీనికి కారణం.. రెండునెలలుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న జాన్వి, శిఖర్‌ పహారియా చిలక్కొట్టుడు ఫొటోలు! శిఖర్‌ పహాడియా అంటే.. కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ సీఎం, ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్‌.. సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు. ఇతగాడి అన్న వీర్‌ కూడా మాంచి రసికుడే. అతడు సైఫ్‌ అలీఖాన్‌ కూతురుతో డేటింగ్‌ చేస్తున్నాడని బలమైన ఊహాగానాలున్నాయి. ఇంతకీ అసలు విషయానికి వస్తే.. ఒక పార్టీలో శిఖర్‌ పహారియా ముద్దులు పెట్టుకుంటూ కెమెరా కంటికి చిక్కారు. ఒకటి బుగ్గమీద.. మరొకటి వేడివేడి అధర చుంబనం. ఈ ఫొటోలు బయటకు రాగానే శ్రీదేవి స్ట్రిక్ట్‌ మమ్మీ అయిపోయిందట. ప్రస్తుతానికి కెరీర్‌పైనే దృష్టి పెట్టాలని.. ఇలాంటి వ్యవహారాల జోలికి పోవద్దని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిందట. ఎవరూ ధ్రువీకరించలేదుగానీ.. ప్రస్తుతం న్యూయార్క్‌లో యాక్టింగ్‌ కోర్స్‌ చేస్తున్న జాన్వి త్వరలో కరణ్‌ జోహార్‌ తీయబోతున్న 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పార్ట్‌ 2'తో తెరంగేట్రం చేయబోతోందనే ప్రచారమైతే విస్తృతంగా ఉంది. అలాగే.. దక్షిణాదిలో కూడా 'జాన్వి' ఒక సినిమాకు సంతకం చేసిందని సమాచారం.

No comments:

Post a Comment

About

Flickr