Nestham Movie Creations

Friday, 11 November 2016

బూతు సినిమానా మజాకా


బూతు సినిమానా మజాకా!సన్నీలియోన్‌ సినిమాలు సరిగ్గా ఆడడం లేదని బూతు సినిమాలకి గిరాకీ పడిపోయిందని అనుకుంటున్నారు కానీ ఇలాంటి సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త ముఖాలని చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారనే సంగతిని విస్మరిస్తున్నారు. సన్నీ లియోన్‌ ఎన్నిసార్లు చేసినా సెన్సార్‌ నిబంధనలకి లోబడి అదే కదా చేసేది. అలాంటప్పుడు ఆమె కొత్త సినిమాలు చూడాల్సిన అవసరం ఏముంది? అదే జరీన్‌ ఖాన్‌ చేసేసరికి హేట్‌ స్టోరీ 3 చిత్రాన్ని ఎగబడి చూసారు. ఈ చిత్రం ట్రెయిలర్‌కి యూట్యూబ్‌లో రెండు కోట్ల ఎనభై లక్షలకి పైగా వ్యూస్‌ వచ్చాయి. అదే సన్నీలియోన్‌ సినిమాలనే కాదు ఇప్పుడు ట్రెయిలర్స్‌ చూడ్డానికి కూడా ఎక్కువ ఆసక్తి ఉండడం లేదు. ఈ జానర్‌లో ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకుంటారని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. సనా ఖాన్‌ నటిస్తోన్న 'వజా తుమ్‌ హో' ట్రెయిలర్‌లో విచ్చలవిడి శృంగారం చాలానే ఉంది. దాంతో ఈ ట్రెయిలర్‌కి అంతులేని ఆదరణ లభిస్తోంది. విడుదల చేసి రెండు వారాలైనా అవకముందే దీనికి కోటిన్నర వ్యూస్‌ వచ్చాయి. ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా బాగుంటాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంటే మెనూ మార్చకపోయినా కానీ కొత్త సర్వర్‌తో వడ్డిస్తే తినడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారన్నమాట. ఇలాగైతే ఒక్కసారి ఇలాంటి సినిమా చేసేసిన హీరోయిన్ల పరిస్థితి తర్వాత ఎలాగో ఏంటో పాపం.

No comments:

Post a Comment

About

Flickr