
లండన్ బ్యూటీ కత్రినా కైఫ్ తో బ్రేకప్ తర్వాత బాలీవుడ్ లవర్ బోయ్ రణ్‌బీర్ కపూర్ కొత్త గాళ్ ఫ్రెండ్ ను సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం సౌత్ బ్యూటీ శృతి హాసన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అదంతా పుకారే అని తేలిపోవడంతో శ్రీలంక సుందరి జాక్వెలీన్ ఫెర్నాండెజ్ సీన్ లో ప్రవేశించింది.
కేట్ తో విడిపోయాక బాబు ఈ అమ్మడితోనే క్లోజ్ గా ఉంటున్నాడని, ఇద్దరూ కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారని వార్తలు షికారు చేశాయి. ఇదే విషయమై రణ్‌బీర్ లేటెస్ట్ గా స్పందించాడు. కొత్త సినిమా 'యే దిల్ హై ముష్కిల్' ప్రమోషన్స్ లో భాగంగా ఓ రియాల్టీ షోకు హాజరైన ఈ 'బర్ఫీ' స్టార్ కు జాక్వెలీన్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పండి అన్న ప్రశ్న ఎదురైంది. దీంతో ఒన్ సైడ్ లవ్ గురించే కాక, తన రూమర్డ్ గాళ్ ఫ్రెండ్ గురించీ ఆసక్తికర వివరాలు చెప్పాడు.
‘‘వన్ సైడ్ ప్రేమకి ఉన్న పవరే వేరు. మిగతా సంబంధాల్లా ఇద్దరి మధ్య విడిపోవడం అనేది ఉండదు. అలాగే జాక్వెలీన్‌పై కేవలం నాకు మాత్రమే హక్కు ఉంది’’ అంటూ కామెంట్ చేశాడు రణ్‌బీర్. కపూర్స్ వారి అబ్బాయి సినిమాటిక్ గా చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం బీటౌన్ టాక్ గా మారింది. జాక్వెలీన్ పై ఏకంగా తనకే హక్కు ఉందడనడంతో వ్యవహారం కాస్త ముందడుగే పడిందని అంతా అనుకుంటున్నారు. రణ్‌బీర్, జాక్వెలీన్‌లు డేటింగ్‌లో ఉన్నారా? అనే విషయమై బాలీవుడ్ లో చర్చ కూడా ప్రారంభమైపోయింది.
ఇదిలా ఉంటే, రణ్‌బీర్ విదేశీ అమ్మాయిలపైనే మనసుపడడం మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారింది. రణ్‌బీర్ లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత అతడి గాళ్ ఫ్రెండ్స్ గా సోనమ్ కపూర్, దీపిక పదుకోన్, నర్గీస్ ఫక్రి, కత్రినా కైఫ్.. ప్రస్తుతం జాక్వెలీన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీరిలో నర్గీస్, కత్రినా, జాక్వెలీన్ లు విదేశీ భామలు. ఈ సంగతి పక్కన పెడితే రణ్‌బీర్-జాక్వెలీన్ ల స్నేహం నిలుస్తుందా? లేక ఈ బంధం కూడా చరిత్రలో కలిసిపోతుందా? వేచి చూడాలి
No comments:
Post a Comment