'కాష్మోరా' విడుదలకి దగ్గరయ్యే కొద్దీ దానిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ట్రెయిలర్‌లో యుద్ధ సన్నివేశాలు, కట్టప్ప గెటప్‌లో కార్తీని చూసి ఇది బాహుబలికి కోలీవుడ్ ఆన్సర్ అంటూ అక్కడి జనం తొడలు కొట్టేస్తున్నారు. ట్రెయిలర్ చూసిన వాళ్లు దీనిని మరో బాహుబలిలా ఊహించేసుకుంటున్నారు. అయితే ఈ హైప్ ఎక్కడ తిప్పికొడుతుందో అనే భయం కార్తీని, చిత్ర బృందాన్ని పట్టి పీడిస్తోంది. 'కాష్మోరా'కీ, బాహుబలికీ పొంతనే ఉండదని, దయ చేసి పోలికలు వెతక్కండని వాళ్లు పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు. కార్తీ అయితే బాహుబలి ముందు తమ సినిమా ఒక బల్లి మాదిరి అని చెప్పడానికి సైతం వెనకాడడం లేదు. ఎలాగైనా అంచనాలు తగ్గించి, ఈ బాహుబలితో పోలిక తప్పించాలని కాష్మోరా బృందం గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ ట్రెయిలర్‌తో పక్కదారి పట్టించేసారు కాబట్టి ఇక జనాలని ఆ మూడ్‌లోంచి బయటకి తేవడం కష్టం. బాహుబలిని దృష్టిలో పెట్టుకుని వెళుతోన్న వారిని నిరాశకి గురి చేయనంత కంటెంట్ కాష్మోరాలో ఉంటే ఏమీ ఫర్వాలేదు కానీ ఒకవేళ నిరాశ పరిస్తే మాత్రం బాహుబలి రివర్స్ దెబ్బ అలా ఇలా ఉండదు మరి. ఈ సినిమా కోసం నానా కష్టాలు పడ్డ కార్తీ ఇలా అనుకోని ఇబ్బంది వచ్చి పడడంతో తన చిన్న సినిమాని ఎలా కాపాడుకోవాలో తెలీక అడిగిన వాళ్లకీ, అడగని వాళ్లకీ కూడా మాది బాహుబలి కానే కాదు బాబూ అంటూ చెప్పుకుంటున్నాడు.

No comments:
Post a Comment