నాగచైతన్య విషయంలో సమంత మరింత ఓపెన్ అయిపోయింది. అతను లేకుండా బతకలేను అనేసింది. మీకు ప్రస్తుతం ట్విట్టర్లో చిట్ చాట్ సందర్భంగా 'జీవితంలో అత్యంత ముఖ్యమైనవి ఏంటి.. ఏవి లేకుండా బతకలేరు' అంటూ ఓ అభిమాని అడిగితే.. ''నాగచైతన్య, మస్కతి ఐస్ క్రీమ్, పని'' అంటూ తనదైన శైలిలో బదులిచ్చింది సమంత. కెరీర్లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏదంటే.. చైతూ కాంబినేషన్లో తాను చేసిన తొలి సినిమా 'ఏమాయ చేసావె' పేరే సమంత చెప్పడం విశేషం. ప్రేమమ్ సినిమాలో నాగచైతన్య పెర్ఫామెన్స్ గురించి ఓ ప్రశ్న అడిగితే.. అతణ్ని చూసి ప్రౌడ్గా ఫీలవుతున్నానని సమంత వ్యాఖ్యానించింది. మీ జీవితంలో అందుకున్న అత్యంత ముఖ్యమైన సలహా ఏదని అడిగితే.. 'ప్రతి సినిమానూ నీ తొలి సినిమాలాగే ఫీలవ్వు' అన్న మహేష్ బాబు చెప్పిన మాటను గుర్తు చేసుకుంది సమంత. మీ బలం ఏంటి అని అడిగితే.. నాకేం కావాలో నాకు తెలవడమే అని సమంత బదులిచ్చింది. ''పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోయే కొత్త సినిమాలో హీరోయిన్ మీరేనంటూ వస్తున్న వార్తలపై ఏమంటారు'' అని అడిగితే.. అది అబద్ధం అని సమంత క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన పాటల్లో విక్రమ్ 'ఇంకొక్కడు' సినిమాలోని 'హెలెనా' అని చెప్పింది. సల్మాన్ ఖాన్ సినిమాల్లో అత్యంత ఇష్టమైంది ఏదంటే 'సుల్తాన్' అని సమంత చెప్పింది

No comments:
Post a Comment