Nestham Movie Creations

Thursday, 10 November 2016

చిరుతో లక్ష్మీరాయ్.. ఇంత హాటా?


చిరుతో లక్ష్మీరాయ్.. ఇంత హాటా?టీనేజీలో ఉండగా తెలుగులో చేసిన తొలి సినిమా ‘కాంచనమాల కేబుల్ టీవీ’లోనే రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది లక్ష్మీరాయ్. ఆ తర్వాత కూడా అదే ఒరవడి కొనసాగిస్తూ ఎక్స్‌పోజింగ్ చేస్తూ వచ్చింది. తెలుగులో సరైన బ్రేక్ రాకపోయినా.. తమిళంలోకి వెళ్లి అక్కడా రెచ్చిపోయింది. కానీ ఆమె అందాలకు అనుకున్న స్థాయిలో గిరాకీ లేకపోయింది. ఒక దశలో లక్ష్మీరాయ్ కెరీర్ ముగిసిపోయిందనే అనుకున్నారంతా. కానీ ఆ టైంలోనే రాయ్ లక్ష్మీ అని పేరు మార్చుకోవడమే కాదు.. హీరోయిన్ వేషాలకు స్వస్తి చెప్పి ఐటెం సాంగ్స్ వైపు మళ్లింది కర్ణాటక పాప. ఈ ఐటెం వేషాలు బాగానే వర్కవుటవుతున్నట్లున్నాయి. ఈ ఏడాది సమ్మర్లో రాయ్ లక్ష్మీ చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిజల్ట్ ఎలా ఉన్నా ఆమె పాట మాత్రం బాగానే హైలైట్ అయింది. ఇప్పుడు అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీలోనే ఆయనతో కలిసి చిందులేసే ఛాన్స్ పట్టేసింది రాయ్. ఈ అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకోవడానికి అందాల గేట్లను మరింతగా ఎత్తేసింది రాయ్ లక్ష్మీ. చిరుతో ఆమె చేసిన పాటకు సంబంధించిన ఒక పిక్ లీక్ అయింది. అందులో రాయ్ లక్ష్మీ మామూలు హాట్‌గా లేదు. రెచ్చిపోయి క్లీవేజ్ షో చేసేస్తోంది. ఈ పాటకు మాంచి మసాలా అద్దినట్లే ఉన్నారు. అసలే చిరు డ్యాన్సులు.. పైగా రాయ్ లక్ష్మీ అందాలు.. సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతుందేమో

No comments:

Post a Comment

About

Flickr