Nestham Movie Creations

Wednesday, 9 November 2016

నా పేరు షబానా...!


tapseeఅత్యాచారయత్నంతో మనో వేదనకు గురైన యువతి కథ నేపథ్యంలో తెరకెక్కిన పింక్ చిత్రం విమర్శకుల ప్రశంసల్ని అందించి నటిగా నాకు బాలీవుడ్‌లో రెడ్ కార్పెట్‌ని పరిచింది. ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో కొత్త తరహా చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నాను అంటోంది తాప్సీ. ఆమె బాలీవుడ్‌లో నటిస్తున్న తాజా చిత్రం నామ్ షబానా. బేబీ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శివమ్ నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీరజ్ పాండే నిర్మాత. మహిళా ప్రధాన ఇతివృత్తంతో యాక్షన్ థ్రిల్లర్‌గా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో తాప్సీ పాత్ర శక్తివంతంగా సాగుతుందట. ఈ పాత్ర కోసం ఆమె మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌ని నేర్చుకుందని తెలిసింది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ నేను నటిస్తున్న తాజా చిత్రం నామ్ షబానా. ఇందులో నా పాత్ర పేరు ప్రియ. అయితే షబానాగా ఎందుకు మారిందన్నది ఆసక్తికరంగా వుంటుంది. ఈ పాత్ర కోసం చాలా కసరత్తులే చేశాను. నా కెరీర్‌లో మంచి చిత్రమవుతుందన్న నమ్మకం వుంది అని చెప్పింది.

No comments:

Post a Comment

About

Flickr