Nestham Movie Creations

Wednesday, 9 November 2016

బాలయ్య న్యూ లుక్ అదుర్స్


క్రిష్ దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య శాతకర్ణిగా కనిపించనుండగా, ఆయన తల్లిగా హేమమాలిని, భార్య వశిష్టి దేవిగా శ్రేయ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు ఫోటోలు విడుదల కాగా, ఇవి సినిమాపై అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా బాలయ్యకు సంబంధించిన మరో లుక్ బయటకు వచ్చింది. ఇందులో బాలయ్య చిరు నవ్వు చిందిస్తూ రాజసంతో దూసుకొస్తున్నాడు. ఈ ఫోటోని చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక కొందరు అభిమానులు బాలయ్య సినిమా భారీ హిట్ సాధించాలని భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్ర చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఈ యాత్రకు సంబంధించి వెహికిల్స్ కూడా రెడీ చేశారు. వీటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మూవీకి మంచి ప్రమోషన్ లభించనుందని చెబుతున్నారు.

No comments:

Post a Comment

About

Flickr