Nestham Movie Creations

Wednesday, 9 November 2016

రజినీకాంత్ కూతురు మూవీ న్యూ లుక్ రిలీజ్


సూపర్ స్టార్ రజినీకాంత్ తనయ సౌందర్య రజినీకాంత్ కొచ్చాడియన్ సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన డైరెక్షన్ లో ధనుష్ హీరోగా మరో సినిమా చేయనుంది. ఈ చిత్రాన్ని కబాలి నిర్మాత కలైపులి థాను తో పాటు వార్డ్ రోబ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ని విడుదల చేశారు. ఈ మూవీ గతంలో సూపర్ హిట్ విజయం సాధించిన వేలైఇల్లా పట్టాతారై(విఐపి) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనుంది. విఐపీ చిత్రం తెలుగులో రఘువరన్ బిటెక్ టైటిల్ తో విడుదలై ధనుష్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు సౌందర్య తీయనున్న మూవీ బైలింగ్యువల్ మూవీగా తెరకెక్కనుండగా, ఈ మూవీని తెలుగులో విఐపీ2 టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేయనున్నాడు.

No comments:

Post a Comment

About

Flickr