Nestham Movie Creations

Thursday, 10 November 2016

పాతికేళ్ళ తర్వాత అక్కడ రీ ఎంట్రీ

amala re entry with mollywood movie
ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన అమల పెళ్ళి తర్వాత సినిమాలకు కాస్త దూరంగానే ఉంది. ఇక ఈ మధ్య తెలుగులో శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అమల అమ్మ పాత్రలో మెరవగా ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఇక గత ఏడాది హిందీలో హమారీ అధూరి కహానీ అనే చిత్రం చేసింది. ఇందులో అమల చేసింది చిన్న రోలే అయిన తన తనయుడు అఖిల్ ని మాత్రం ఫుల్ గా ఇంప్రెస్ చేసింది. ఇక తాజాగా మలయాళంలోను రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అక్కినేని అమల పాతికేళ్ళ క్రితం మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి ఉల్లాడక్కం అనే చిత్రంలో నటించింది. ఇక ఈ చిత్రం తర్వాత అమల చాలా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు అంటోనీ సోని డైరెక్షన్ లో కేరాఫ్ సైరాభాను అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో మంజూ వారియర్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ఆమె పోస్ట్ ఉమన్ గాను.. అమల లాయర్ గాను నటించనున్నారు. వీరిద్దరి చుట్టూనే సినిమా అంతా తిరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషలలో రీ ఎంట్రీ ఇచ్చిన అమల మల్లూవుడ్ లోను రీ ఎంట్రీ ఇస్తుండడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు.

No comments:

Post a Comment

About

Flickr