ఊహలు గుసగుసలాడే , జ్యోఅచ్చుతానంద వరుస హిట్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ త్వరలోనే నాని తో ఓ సినిమా చేయబోతున్నాడు..ప్రస్తుతం నాని వరుస చిత్రాలతో బిజీ గా ఉండడం తో , ఈ లోపు ‘హంటర్’ రిమేక్ లో నటించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ చిత్రం అనుకోని చాల రోజులే అవుతుంది కానీ సెక్స్ అడెక్ట్ కంటెంట్ కావడం తో ఈ మూవీ లో నటించేందుకు ఏ హీరోయిన్ ముందుకు రాకపోవడం తో ఇన్ని రోజులు సెట్స్ ఫైకి రావడానికి ఆలస్యం అవుతూ వస్తుంది.
తాజాగా ఈ మూవీ లో రెజీనా నటించడానికి ఒకే చెప్పిందని సమాచారం. ముందుగా కథ విన్న ఈమె , కాస్త వెనుకడుగు వేసిన , ఆ తర్వాత శ్రీనివాస్ రంగంలోకి దిగి ఆమెను ఒప్పించాడట. ‘హంటర్’ మూవీలో రాధిక ఆప్టే చేసిన పాత్రను రెజీనా చేయనుంది. మరో ఇద్దరు హీరోయిన్స్ గా తేజస్వి, శ్రీముఖి నటించనున్నారు. నవీన్ మేడారం అనే నూతన దర్శకుడు ఈ ‘హంటర్’ రిమేక్ ను తెలుగు నెగిటివిటి కి తగట్టు తెరకెక్కించబోతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బోల్డ్ కంటెంట్ తో రానున్న హంటర్ రిమేక్ తెలుగు లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
No comments:
Post a Comment