
సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించిన కథానాయిక అనుష్క. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు. నవతరం కథానాయికలు ఎంతమంది వస్తున్నా, అనుష్క స్థానాన్ని ఇంచు కూడా కదిలించలేకపోతున్నారు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు ఇప్పటికీ అనుష్కకే ఫస్ట్ ఛాయిస్.
అయితే.. అనుష్క దృష్టి ఇప్పుడు పెళ్లిపై మళ్లింది. పెళ్లిచేసుకొని జీవితంలో స్థిరపడాలన్న నిర్ణయానికి వచ్చేసిందని అనుష్క సన్నిహితులు చెబుతున్నారు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి అనుష్క పై చాలా రూమర్లు గాసిప్ లు వచ్చాయి. చాలా మంది హీరోలతో ఆమెకి లింకులు పెట్టారు. అయితే అనుష్క మాత్రం తన క్యారెక్టర్ ఏమిటో ప్రతీసారి రుజువుచేస్తూనే వచ్చింది. గాసిప్పులను కాలానికే వదిలేసింది. ఆ గాసిప్పులు కూడా గాసిప్పులు గానే మిగిలిపోయాయి. ఇటివల అనుష్క పెళ్లిపై మరో గ్యాసిప్పు పుట్టుకొచ్చింది. ఇండస్ట్రీకే చెందిన ఓ ప్రొడ్యూసర్ ని ఆమె చేసుకోబోతుందనే వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ గాలి కబుర్లు గాని మిగిలిపోయాయి.
లేటెస్ట్ సమాచారం ఏమిటంటే.. పెళ్లిచేసుకొని జీవితంలో స్థిరపడాలన్న నిర్ణయానికి వచ్చేసింది అనుష్క. ఇది కన్ఫర్మ్. అయితే ఆమె పెళ్లి ఇండస్ట్రీ వ్యక్తితో మాత్రం జరగదట. ప్రస్తుతం అనుష్క కోసం తగిన సంబధాలు చూస్తున్నారు. త్వరలోనే తనకు తగ్గ వరుడ్ని ఎంచుకోబోతుందట అనుష్క. బాహుబలి 2రిలీజ్ అయిన తర్వాత ఆమె పెళ్లిపై ఓ ప్రకటన రావచ్చని తెలుస్తోంది.
No comments:
Post a Comment