
భారత్లో అధికారికంగా ఎన్ని మతాలున్నా.. అనధికారికంగా ఉన్న మతాలు మూడు. అవి.. సినిమాలు, రాజకీయాలు, క్రికెట్. తమకు నచ్చిన సినిమా హీరోనైనా, రాజకీయ నాయకుడినైనా, క్రికెటర్‌నైనా ఆకాశానికి ఎత్తేస్తారు.. తేడా వస్తే పాతాళానికి తొక్కేస్తారు. ముఖ్యంగా సినిమా హీరోల విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. హీరోయిన్లకు కెరీర్ టైమ్ తక్కువైనా.. ఫ్యాన్స్ గుండెల్లో మాత్రం గుడి కట్టుకునేలా ముద్రేసే ఛాన్స్ వాళ్లకుంటుంది. గతంలో ఇండియాలో.. ముఖ్యంగా సౌతిండియాలో హీరోయిన్లను నెత్తిన పెట్టుకుని చూసుకున్న ఫ్యాన్స్ కు కొదువేలేదు. కానీ ఈరోజుల్లో సినిమా పిచ్చి అంత పీక్స్ లో లేదని భావించేవాళ్లు.. ఈ న్యూస్ వింటే అవాక్కవాల్సిందే.
మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో అయితే ఈ అభిమానం హద్దులు దాటుతుంటుంది. వారు సినిమా తారలను దేవతలుగా భావిస్తారు. అందుకే సినిమా హీరోయిన్లకు గుళ్లు కూడా కట్టిస్తూ ఉంటారు. గతంలో ఖష్బూను పిచ్చిగా అభిమానించిన తమిళులు ఆమెకు ఓ గుడ్డి కట్టేసి తమ భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత బొద్దు గుమ్మలు నమిత, హన్సికలకు కూడా గుళ్లు కట్టారు. తాజాగా ఆ జాబితాలోకి యువ హీరోయిన్ నేను శైలజ ఫేమ్ కీర్తీ సురేష్ చేరింది. థొడరి మూవీతో ఇటీవలె తమిళ తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే నాలుగు సినిమాలు చేసేసింది. అక్కడి అగ్రహీరోలతో కూడా జోడీ కడుతున్న ఈ ముద్దుగుమ్మ తమిళ తంబీలకు తెగ నచ్చేసింది. ఇంకేముంది ఖుష్బూ, నమిత, హన్సికలతో సమానంగా కీర్తికి కూడా గుడి రెడీ అయిపోతోంది
No comments:
Post a Comment